ఏకాక్షర నిఘంటువు - 8
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి........
త - సంభోగము, నిశ్చయము, కోపము, తోక, రసవాదము,
చోరుడు, దయ, ఆడుట, కారణము.
తః - మణి, నవ్వు, చూలు, ఓర్పు, అమృతము, బుద్ధుడు,
యువకుడు, మోసము, మ్లేచ్ఛుడు, దొంగ, పందితోక
తత్ - ప్రస్తుతార్థము, హేతువు,
వేతనములేక పనిచేయువాడు.
తమ్ - ఆలయము, బాధనొందు,
ధనధాన్యములనొసగు బీజాక్షరము,
తమోబీజము.
తప్ - ప్రకాశించు, వెచ్చగానుండు, బాధసహించు,
శరీరమును కృశింపచేయు, తగులబడు.
తా - పుణ్యము
తృష్ - దప్పిక, తీవ్రమగు కోరిక.
తే - పార్వతి
తేః - క్రీడించు, క్రీడించువాడు, నది, భయమును పోగొట్టుట,
నలుపు, తెలుపు, లావు
త్యజ్ - విడిచిపెట్టు, వదిలించుకొను
త్వచ్ - తోలు, వల్కలము, ఆవరణము, స్పర్శేంద్రియము.
త్వమ్ - నీవు
త్వట్ - కాంతి, అగ్నిజ్వాల, వెలుగు.
త్రుట్ - తెగుట, చిరుగుట.
త్రై - కాపాడు, రక్షించు.
థః - కొండ, నీతినికాపాడుట.
No comments:
Post a Comment