సతతము సంతసమెసంగు సత్యవ్రతికిన్
సాహితీమిత్రులారా!
సత్యవ్రతి శతకము,
భాగవతుల లక్ష్మీనారాయణశాస్త్రిగారు
రచించారు అందులోని 83వ పద్యం
ఏకాక్షరిగా వ్రాశారు చూడండి-
ఇది ఒక ప్రత్యేకమైనదనవచ్చు
ఎందు కంటే ఇందులో ఒకేహల్లు(వ్యంజనము)
ఉపయోగించాలి కాని అచ్చులు ఏవైనా ఎన్నైనా
వాడుకోవచ్చును కాని ప్రత్యేకంగా అచ్చులను
ఎక్కువగా వాడరు ఇందులో అచ్చులు విడిగా
ఉపయోగించబడ్డాయి గమనించండి-
ఋత తిత ఊత్తు త్తీతా
తతేతి తాతేత తాత తత్తై తత్తా
తత తుత్తా తతి తుత్తిన్
సతతము సంతసమెసంగు సత్యవ్రతికిన్
ఇందులో త - అనే హల్లు ఒకటే
ఉపయోగించి కూర్చబడినది.
మరియు ఇందులో నాలుగవ పాదము
అన్ని పద్యములకు
మకుటంగా ఉన్నందున
అది ఒకే వ్యంజనము
ఉండనవసరములేదు.
ఋత - సత్యమనెడు, తితఉ - జల్లెడచేతను,
ఇత - పొందబడిన, ఆతత - విస్తారియగు,
ఇతి - జ్ఞానము చేతను, తాత - తండ్రివంటి
పరమేశ్వరుని యొక్క, ఇత - పొందబడిన,
తాత - దయచేతను, తత్తైతత్తా - అది ఇది
అనే భేదభావముచేత కలిగిన, తత - అధికమగు,
తుత్తాతతి - బాధ సమూహమును,
తుత్తిన్ - కొట్టుటచేతను,
సత్యవ్రతికి సంతసమొసగును.
పదార్థశోధనముచే గలిగిన జ్ఞానముచేతను,
ఈశ్వరజ్ఞానము చేతను, సంసార దుఃఖము
తొలగుననియు అందుకు సత్యము మూలమని
తాత్పర్యము.
No comments:
Post a Comment