Friday, December 16, 2016

తనసతి పెండ్లి జూచుటకు దానును నేగె


తనసతి పెండ్లి జూచుటకు దానును నేగె




సాహితీమిత్రులారా!





సమస్య -
తనసతి పెండ్లి జూచుటకు దానును నేగెను సత్వరంబుగన్

ఈ సమస్య మరియు పూరణ
శతావధాన ప్రబంధము - 2 లోనిది.

ఘనగతి నేమి ఘోషమెసగన్ ఋతుపర్ణు రథమ్ము దోలుచున్
మనమున నగ్నియై దరికొనన్ దమయంతి పునః స్వయంవరం
బనియెడి వార్త బాహుకసమాఖ్యుడు నైషధు దావిదర్భకున్
దనసతి పెండ్లి జూచుటకు దానును నేగెను సత్వరంబుగన్

ఈ పూరణలో పదాల విరుపులు లేవు,
శబ్దశ్లేష వంటి చమత్కారాలు లేవు.
కేవలం కథాపరంగానే చెప్పడం జరిగింది.
నలోపాఖ్యానంలో నలుని జాడ తెలిసికోటానికి
విదర్భరాజు రెండవ స్వయంవరం ప్రకటించగా,
దానికి ఋుతుపర్ణుడు వెళుతూ సారథిగా
బాహుకుడనే పేరుతో నలుడుకూడ వెళ్ళినాడు.

ఇందులో కథాపూరణ తప్ప తమత్కారమేమీ లేదు.

మీరెవరైనా చమత్కారపూరకంగా పూరించి పంపగలరు.





No comments: