నక్షత్రము పైన వేసి నాథుని బిలిచెన్
సాహితీమిత్రులారా!
ఈ గూఢచిత్ర పద్యాన్ని చూడండి -
నక్షత్రము గల చిన్నది
నక్షత్రము చేతబట్టి నక్షత్ర ప్రభున్
నక్షత్రమునకు రమ్మని
నక్షత్రము పైన వేసి నాథుని బిలిచెన్
ఈ పద్యంలో నక్షత్రం అనే
పదం ఎక్కువ మార్లు వాడారు
విషయమేమిటో తెలియాలంటే
కొంత ఆలోచించాల్సిందే-
నక్షత్రము గల చిన్నది -
తన పేరులో నక్షత్రము ఉన్న యువతి - ఉత్తర,
నక్షత్రము చేత బట్టి -
భరణిని, కుంకుమ భరిణను చేతిలో పట్టుకొని,
నక్షత్ర ప్రభున్ -
నక్షత్రాలకు ప్రభువైన వాని వంశపు అభిమన్యుని,
నక్ష్తమునకు రమ్మని - ఒక మూలకు రమ్మని పిలిచి,
నక్షత్రము పైన వేసి - హస్త - మును అతని మీద వేసి,
నాథుని పిలిచెన్ -
పతియైన అభిమన్యుని ప్రేమతో పిలిచింది.
ఇది అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించటానికి
యుద్ధానికి వెళ్ళే సమయంలో అతని భార్య ఉతర
వీరతిలకం దిద్ది పంపే సందర్భములోనిది.
No comments:
Post a Comment