Thursday, December 8, 2016

ఏకాక్షర నిఘంటువు - 4


ఏకాక్షర నిఘంటువు - 4



సాహితీమిత్రులారా!



నిన్నటి తరువాయి..........


-   బ్రహ్మ, వాయువు, పరమాత్మ, అగ్ని, చిత్తము,
        సూర్యుడు, బుద్ధి, యముడు, నెమలి, విష్ణువు,
        సముద్ర వస్తువు, శ్వేత వర్ణం, సిగ్గు, తల, సుఖం,
        ఏడాది, తెలుపు, అడవి, ఆశ్చర్యం, పసుపు, నీరు.

క: -  విష్ణువు, చతుర్ముఖుడు, మన్మథుడు, అగ్ని, వాయువు,
          సూర్యుడు, యముడు, దక్షుడు, పక్షి, మేను, ఆత్మ,
          ధ్వని, బుద్ధి, నెమిలి,కాంతి, కాలము.

కం -  నీరు, సుఖము, శిరసు, బ్రహ్మము.


కిం -  ఏమని అడుగుట, నింద, ఆక్షేపణ, సందేహం,
              వికల్పం, దూఱు, నీతి, అడుగు.

కి  -  జ్ఞానం, ఎఱుంగుట.

కీ  -  నింద

కు  -  భూమి, కుత్సిత పాపము, కొంచెము, నివారించుట,
             నింద, రాయి, షష్ఠీ విభక్తి ప్రత్యయము.

కు: - భూమి, ఒకటి.

కూ: - పిశాచి.

క్రా:  - ఆక్రమించువాడు.

క్రీ: - కొనివాడు.

క్రీ - కాలికా, బీజము.

క్రోం - అంకుశ బీజము.

క్రౌమ్ - అంకుశ బీజము.

క్లీం - జగన్మోహన(కామ)బీజము.

క్ష   - అడ్డగించుట, విరోధము, క్షేమము,
           దుస్స్వప్నము,  క్షత్రియుడు, రక్కసుడు.

క్షం - పొలము, రక్కసుడు.


క్ష:  -  క్షేత్రము, వక్షస్స్థలము, వ్యాకరణశాస్త్రము.


క్షి:  -  క్షేత్రము, క్షాత్రసంరక్షణము, నరసింహస్వామి.


క్షా - ఓర్పు, నిద్ర

క్ష్మా - భూమి





No comments: