Tuesday, December 27, 2016

శుద్ధకులజాత యొక సతి


శుద్ధకులజాత యొక సతి




సాహితీమిత్రులారా!


ఈ పొడుపు పద్యం విచ్చండి-

శుద్ధకులజాత యొక సతి
యిద్ధరణిం దండ్రిఁ జంపి యెసఁగ విశుద్ధిన్
బుద్ధిఁ బితామహుఁ బొందుచు
సిద్ధముగాఁ దండ్రిఁగనును చెప్పుడు దీనిన్

ఒక శుద్ధకులంలో పుట్టిన స్త్రీ
తండ్రిని చంపి  తాతను కలిసి
తండ్రిని కన్నదట - అదేమిటో
చెప్పమంటున్నాడు కవి-

సమాధానం - మజ్జిగ

సమాధానం ఎలాగంటే-
మజ్జిగకు పెరుగు తండ్రి
అలాగే మజ్జిగకు పాలు తాత
మజ్జిగ, తండ్రిని అంటే పెరుగును
చంపి పుడుతుందికదా
(పెరుగును చిలకడం వలన అంటే
మధించడం వలన పుడుతుంది)
అలా పుట్టిన మజ్జిగ తాతను అంటే
పాలను చేమిరి రూపంగా కలిసి
మళ్ళీ తండ్రిని కంటుంది - ఇది దీనిలోని
గూఢార్థం. కావున ఇది గూఢచిత్రంగాను
ప్రశ్న అడగడం వలన పొడుపు కధగాను
చెప్పబడుతున్నది.

No comments: