Wednesday, December 7, 2016

శంఖంబుల్ దివినుండి వ్రాలిపడియెన్


శంఖంబుల్ దివినుండి వ్రాలిపడియెన్ 




సాహితీమిత్రులారా!


గద్వాల సంస్థానానికి
సంబంధించిన
తొలితెలుగు సమస్య-

శంఖంబుల్ దివినుండి వ్రాలిపడియెన్ జంబూఫల ప్రక్రియన్

కాణాదం పెద్దనసోమయాజి పూరణ-

ప్రేంఖల్లీల విశృంఖలస్థితిని బ్రేరేపింప నుచ్చైశ్రవ
కంఖాణుండు ఘనాళినుండి జలరేఖాబిందుసందోహము
ల్పుంఖాపుంఖిని వేలు లక్షలును గోట్లున్యర్బుదంబుల్ మహా
శంఖంబుల్ దివినుండి వ్రాలిపడియెన్ జంబూఫల ప్రక్రియన్


ఇందులో మహాశంఖంబుల్ అనండంతో అది శంఖంకాకుండా
సంఖ్యావాచకంగా మారి అర్థాన్ని మార్చివేసింది.
వర్షం పడే విధానం ఇందులో వివరించారు చిత్రమేమంటే
దీన్ని వీరి అధ్యాత్మరామాయణంలో కిష్కింధకాండలో
వర్షాగమ సందర్భంగా(142ప.) చేర్చారు.

(శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారి పీఠికనుండి-)


No comments: