అధ్యాత్మరామాయణము - చిత్రకవిత్వము
సాహితీమిత్రులారా!
శ్రీమద్రామాయణము అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది వాల్మీకి.
ఆ తర్వాత అనేకమంది రామాయణగాథను అనేక రూపాల్లో
అనేక ప్రక్రియల్లో అనేక భాషల్లో రచించారు. కాని రామాయణాల్లో
అధ్యాత్మరామాయణం ముఖ్యమైనవాటిల్లో ఒకటి. ఇది సంస్కృతంలో
బ్రహ్మాండపురాణంలో ఒక భాగంగా రూపొందింది.
ఆధ్యాత్మికతత్వప్రధానంగా కొనసాగిన రచన కావున
దీనికి అధ్యాత్మరామాయణం అనే పేరుతో సార్థకమైంది.
దీన్ని పరమేశ్వరుడు పార్వతికి చెప్పినట్లుగా ప్రశస్తి.
4000 పైన్నే శ్లోకాలున్నాయి ఇందులో.
దీన్ని తెలుగులో మొదటగా
గద్వాల ఆస్థానంలో విద్వత్కవిగా పేరు
పొందిన కాణాదం పెద్దనసోమయాజిగారు
3,360 గద్యపద్యాల చంపూ కావ్యంగా తీర్చి దిద్దారు.
దీన్ని ఇప్పుడు వెలుగులోనికి తేవడానికి
అవిరళకృషి చేసినవారు
శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారు.
పరిష్కర్తగా, పీఠికాకర్తగా, సంపాదకుడుగా నే కాక
దీన్ని వెలుగులోని తేడానికి అహరహము కృషిచేసిన వారు
శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారు.
వీరికి ఈ కృషికిగాను తెలుగు సాహితీలోకం ఋణపడి ఉంది
అనడంలో అతిశయోక్తిలేదు.
ఇందులోని చిత్రకవిత్వం గురించి గమనిద్దాం-
చిత్రకవిత్వంలోని విభాగాలు-
1. శబ్దచిత్రం -
ఇందులో సోష్ఠ్య చిత్రం, నిరోష్ఠ్యచిత్రం,
సోష్ఠ్య నిరోష్ఠ్య చిత్రం,గుణిత చిత్రం ఉన్నాయి.
2. శబ్దాలంకారచిత్రం-
ఇందులో శ్లేష, యమక,
అనుప్రాస అలంకారాలు ఉన్నాయి.
3. గతిచిత్రం-
ఇందులో పాదభ్రమకం ఉంది.
4. గర్భచిత్రం-
ఇందులో కందద్వయ గర్భ మధ్య యమక చిత్ర
చంపకమాలికా వృత్తము(అయోధ్య-567ప.) కలదు.
దండకంలో స్రగ్విణీవృత్తము, భుజంగప్రయాతము
గర్భస్థంగా కూర్చబడింది.
5. బంధకవిత్వం-
ఇందులో 9 రకాల బంధాలను
సందర్భోచితంగా కూర్చారు.
1. పుష్పమాలికా బంధము
పంచచామరము (అయోధ్య-570ప.)
2. జాంబవత్పాద బంధము
ఉత్పలమాల (కిష్కింధ - 373ప.)
3. రథబంధము
కందము (కిష్కింధ - 374ప.)
4. విశ్వముఖమత్స్యత్రయ బంధము
చంపకమాల (సుందర-242ప.)
5. గోమూత్రికాబంధం
సుమవిచిత్ర వృత్తం (సుందర-244ప.)
6. ఖడ్గబంధం
కందం (యుద్ధ-పూ.భా. 397)
7. పుష్పబంధం
స్రగ్ధరావృత్తం (యద్ధ.పూ.భా. 398ప.)
8. చక్రబంధం
శార్దూలవిక్రీడితం (యుద్ధ.ఉ.భా.412)
9. ఛత్రబంధం
కందం (యుద్ధ.ఉ.భా.413ప.)
ఇందులోని ప్రతివిషయం
మనం వీలువెంబడి వివరించుకుందాము.
ఈ గ్రంథం వలసినవారు
తిరుమల తిరుపతి దేవస్థానం
పుస్తకవిక్రయ కేంద్రాలలో పొందగలరు.
వెల - రు.270
పేజీలు -696
No comments:
Post a Comment