ఏకాక్షర నిఘంటువు - 12
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........
బ - కుంభము, వరుణుడు, బిందువు, వికల్పము, గురువు,
మదము, సంపదలను కలుగజేయువాడు, కలహము,
పక్షము, గర్భము, పర్వతము.
బః - సంద్రము, జలము, వరుణడు, కడవయోని,
గొఱుగుట, గదాయుధము, పండు.
బమ్ - సకల దోషములను హరించు నొక ఊర్మి బీజాక్షరము.
బర్హ్ - పలుకు, ఇచ్చు, గాయపరచు, చంపు,
నాశనముచేయు, వ్యాపించు.
బా - బూరుగ, తీగె, సంకిళ్లు, స్వచ్ఛమైన.
బాధ్ - పీడించు, హింసించు, తొలగించు, గాయపరచు.
బృహ్ - పెరుగు వృద్ధినొందు, గర్జించు.
భ - శివుడు, తుమ్మెద, స్వభావము, శుక్రుడు, కిరణము,
మేఘము, భూమి, అలంకారము, ప్రకాశము.
భః - గ్రహము, భ్రాంతి, భగణము, భవనము, గృహము,
భార్గవుడు, భూధరము, భృంగము.
భక్ష్ - తినుట, మ్రింగుట, జీర్ణించుకొనుట, ఉపయోగించుట.
భజ్ - పంచుట, నిర్దేశించుట, అనుభవించుట,
అభ్యసించుట, సేవించుట, గౌరవించుట.
భంజ్ - ముక్కలుగ చేయుట, చెడగొట్టుట, ఓడించుట.
భష్ - మొరుగుట.
భమ్ - నక్షత్రము, (మేషాది)రాశి, సమస్త భూతోచ్ఛాటన
చేయునట్టి భీకర బీజాక్షరము.
No comments:
Post a Comment