Saturday, December 3, 2016

సా మమారిధమనీ


సా మమారిధమనీ 




సాహితీమిత్రులారా!


సంగీత స్వరాలైన స,రి,గ,మ,ప,ద,ని- అనే
సప్తస్వరాలతో పద్యం లేక శ్లోకం కూర్చటం
చిత్రకవిత్వంలో కలదు. దీన్ని శబ్దచిత్రంలో
తీసుకుంటాము. ఇలాంటి ఒక శ్లోకం-


సా మమారిధమనీ నిధానినీ
సామధామ ధనిధామ సాధినీ
మానినీ సగరిమా పపాపపా
సాపగా సమసమాగమాసమా
                                     (సరస్వతీకంఠాభరణము - 2- 265)


నదీతుల్యమైన క్షణిక సమాగమము కలదియు,
సాటిలేనిదియు, నవనిధులను కలుగజేయునదియు,
కాంతికి నెలవైనదియు, ధనికులకు తేజస్సును
 సంతరించునదియు, అర్చనయోగ్యయు,
గౌరవవంతురాలును, పాపరహితులను
పాలించునదియు అయిన లక్ష్మీదేవి నాకు
అరిధమని(శత్రుసంహారిణి) అగుగాక - అని భావం.


ఈ శ్లోకంలో స,రి,గ,మ,ప,ద,ని - అనే ఏడు
హల్లులను మాత్రమే వాడి శ్లోకాన్ని కూర్చడం జరిగింది.
మీరును గమనించండి
ఈ హల్లులుకాక వేరేమైనా ఉన్నవేమో
(హల్లులుమాత్రమే అచ్చులేవైనా ఉండవచ్చు).

No comments: