కామిగాఁడు మోక్షకామిగాఁడు
సాహితీమిత్రులారా!
సమస్య -
కామిగాఁడు మోక్షకామిగాఁడు
సీసపద్యంలో పూరణ-
నిపుణత్వమున రాజనీతి యెఱుంగక
నేల నేలెడువాఁడు బేలిగాని
సంగీత సాహిత్య సరసత యెఱుఁగక
కృతి చెప్పువాఁడు దుష్కృతుఁడు గాని
కుశలుఁడై యింతుల కోరికల్ దీర్చని
విషయాతురుండు దుర్విటుఁడు గాని
మాధవ శ్రీపాద మగ్నత చెందక
ముక్తి గోరెడువాఁడు రక్తిగాని
అతిదయాభిషక్తి, యతులితమగు యుక్తి,
యంగనానురక్తి, యచలరక్తి -
పరతఁగాంచకున్నఁ బతిగాఁడు కవిగాఁడు;
కామిగాఁడు; మోక్షకామిగాఁడు.
(చాటుపద్యరత్నాకరము -4 - 66)
మీరును ఒక రమణీయమైన పూరణను పంపగలరు.
No comments:
Post a Comment