ఏకాక్షర నిఘంటువు - 2
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..........
ఇ - పాము, రత్నము, కాంతి, ముందు,రహస్యార్థము,
శివుడు, ఆడ ఏనుగు, అంతిపురము, చంద్రకిరణము,
మన్మథుడు, చిత్రము, వంత, శబ్దము, మంట, అగ్రము,
(ఆశ్చర్యము, భేదవాక్యము)
ఇ: - శివుడు, మన్మథుడు, చంద్రకిరణము, పాము, మణి, కాంతి,
ఆడ ఏనుగు, గుహ, దుఖభావన, పరితాపము, కోపము,
ఎదురు, ఇంటిలోపలిచోటు.
ఇమ్ - పుష్టినిచ్చుచు క్షోభరముకానట్టి ఒక బీజము.
ఈ - కోపము, దుఖము, లక్ష్మి, సరస్వతి, గౌరి, నాలుక,
తామరఱేకు, కేసరము, బాణము, సర్పము, మొలనూలు,
దయ, చింత, దగ్గర.
ఈ: - లక్ష్మి, సరస్వతి, తామరఱేకు, నాలుక, ఇంద్రధనస్సు,
గుహ, బాణము, పాము, కమల కేసరము.
ఈమ్ - ఇది పిమ్మట, వాక్ప్రసాదకర నిర్మలబీజము.
ఉ: - రాజు, నేత్రము, ఈశ్వర జటాజూటము, విష్ణువు, శివుడు,
పిలుచుట, కోపము, అంగీకారము, అడుగుట.
ఉం - విష్ణువు, శివుడు, రాజు, కన్ను.
ఉమ్ - పురుషుడు, చంద్రుడు, రాజ పుత్రుడు, కంఠము,
దేవత, ప్రాంగణము, సామ్యము, నిండుకడవ,
వర్తకుడు, రక్షణము, బ్రహ్మ, గుర్తు, శివుడు,
పోలిక, రక్కసుడు.
ఊ: - శివుడు, పాలకుడు, చంద్రుడు,
లక్షణము, రక్షించుట, బ్రహ్మ.
ఊమ్ - నింద, క్రోధ వచనము, పోటి, ప్రశ్న,
దుస్సహమైన, ఉచ్ఛాటన బీజము.
ఋ - ఏనుగు, శైలము, బుద్ధి భేదము, అదితి, స్వభావము,
దేవశత్రువు, నది, మద్యము, బావ, మఱఁది, ఆకాశము,
బొరియ, ఏవగింపు, (సమస్తము).
ఋ: - స్వర్గము, దేవదూత.
ఋక్ - ఋక్కు, ఒక వేదము, ఒక వేద మంత్రము, పూజ, స్తుతి.
No comments:
Post a Comment