Monday, December 12, 2016

దరణిజ శశి శిబి బలులు


దరణిజ శశి శిబి బలులు



సాహితీమిత్రులారా!

వెల్లూరు నరసింగకవి కృత
రాచకన్యకాపరిణము అవతారికలోని
శబ్దచిత్రం చూడండి-

కోదండరామరెడ్డి స
దా దానపు భా గురుత్వ తత్వము తనరం
గా దరణిజ శశి శిబి బలు
లా దివిగవి పగిది లఘువులైరి తలంపన్
                                         (రాచకన్యకాపరిణయము - 1-23)

కోదండరామరెడ్డి దానపు భా - దానకాంతి గురువైనది.
అనగా గొప్పదైనది. దీనిలో  భా - గుర్వక్షరము-
అలఘువు. అపుడు తరణిజ(కర్ణుడు), శశి, శిబి,
బలులు(బలిచక్రవర్తి మొదలైనవారు), ఆ దివిగవి
(కామధేనువు) పగిది లఘువులైరి అనగా చులకనైనారు
- చేవలేనివారు అయినారు. ఇందులో కర్ణాదులు
లఘువులుగా కూర్చబడినది.

ఇది అర్థానికి అనుగుణంగా
అక్షరవిన్యాసం కూర్చబడిన
శబ్దచిత్రము.

No comments: