Wednesday, December 14, 2016

ఇన శశిబింబ యుగ్మముదయించె


ఇన శశిబింబ యుగ్మముదయించె



సాహితీమిత్రులారా!


సమస్య-
ఇన శశిబింబ యుగ్మముదయించె దినాంతమునందు దద్దిశన్

సూర్యచంద్రులు రెండూ ఒకేసారి అదీ సాయంకాలం
ఒకే దిక్కులో  ఉదయించాయని పూరించడం
కవి సామర్థ్యానికి పరీక్షే కాని కవి ఇలా పూరించారు మరి

పూర్వకవి పూరణ -

ఇనసమతేజ మీరు సెలవిచ్చిన పీఠము హేమరత్న సం
జననము, మేరు ప్రస్తరము చక్కగ దీర్చితి పక్షమయ్యె నే
ర్పున సుర కోటులం దిశల బొల్పుగ వ్రాయుచురాగ నేటికా
యిన శశిబింబ యుగ్మముదయించె దినాంతమునందు దద్దిశన్

సూర్యుని వంటి తేజస్సుగలవాడా!
నీవు నాకు ఆజ్ఞాపించిన దేవతా పీఠమును
బంగారము, రత్నాలతో నిర్మిస్తున్నాను.
పక్షం కింద మేరు పర్వత శిఖరమణి
నిర్మించినాను. దేవతలందరిని
ఆ యా దిక్కులలో శిల్పాలుగా
చెక్కుతూరాగా ఈ వేళకి
సూర్యచంద్రుల బింబాలను
సాయంకాల సమయాన ఆ దిక్కున
పీఠముపైన చిత్రించాను - అని పద్యభావం.

No comments: