Friday, December 2, 2016

సర్వజ్ఞ నామధేయము


సర్వజ్ఞ నామధేయము




సాహితీమిత్రులారా!


విజయనగర ప్రభువు ప్రౌఢ దేవరాయల
ఆస్థానంలోని గౌడ డిండిమ భట్టును ఓడించిన
తరువాత అతని కంచు ఢక్కను బ్రద్దలు కొట్టించి
కవిసార్వభౌమ బిరుదును పాదుకొలిపి కనకాభిషేకం
పొంది పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంనికి తిరిగి వచ్చాడు.
సర్వసింగభూపాలునికి పెదకోమటివేమారెడ్డికి గల వైరం
వల్ల పెదకోమటి వేమారెడ్డిచిత్రపటాన్ని సభలో పెట్టికి
సర్వసింగభూపాలుడు సభికులచేత అవమానంకరమైన
పని చేయిస్తున్నాడని తెలిసిన శ్రీనాథుడు ఆ అకృత్యాన్ని
నివారించటానికి సర్వసింగభూపాలుని ఆస్థానానికి వెళ్ళాడట.
ఆ సందర్భంలో శ్రీనాథుడు సింగభూపానికి గురించి
ఈ పద్యం చెప్పాడట-

సర్వజ్ఞ నామధేయము
శర్వునకే రావు సింగ జనపాలునకే
యుర్విం జెల్లును తక్కొరు
సర్వజ్ఞుం డనుట కుక్క సామజ మనుటే

సర్వజ్ఞుడనే పేరు శివునికీ, సింభూపాలునికీ మాత్రమే
భూమిపైన చెల్లుతుంది ఇంకెవరినైనా అలా  పిలవడం
కుక్కను ఏనుగు అనటమే- అని దీని భావం.

దీనితో సింగభూపాలుడు
తనను శివునితో సమానుడని స్తుతించడమేకాక
భూమి మీద మరెవరు ఇంతవారు లేరన్నందుకు
పొంగిపోయి గొప్ప సత్కారం చేసి
శ్రీనాథుడు వచ్చిన పనిని నేరవేర్చాడు.

ఇది ఇలా ఉంటే వేమారెడ్డికి
ఈ వార్త తెలిసి తన శత్రువును శివునితో
సమానంగా పొగడటమా అని బాధ పడ్డాడు.
శ్రీనాథుడు రాగానే అదికాస్తా
అడిగేశాడు. అప్పుడు
శ్రీనాథుడు నవ్వుతూ ఇలా చెప్పాడట-
మహారాజా! నేను సింభూపాలుని పొగడలేదు.
తెగడిన పద్యం అది.
అర్థం చేసుకోలేని ఆయన
స్తోత్రమని భ్రమపడి నాకు సత్కారం చేశాడు

ఇప్పుడు చెప్పండి ఆ పద్యం ఇది-

సర్వజ్ఞ నామధేయము శర్వునికే-
రావుసింజనపాలునకు ఏ యుర్విం జెల్లును
తక్కొరు సర్వజ్ఞుం డనుట కుక్క సామజ మనుటే-

(సర్వజ్ఞ నామము శివునికి మాత్రమే చెల్లుతుంది.
సింగభూపాలునికి ఏ భూమి మీద చెల్లుతుంది.
తక్కొరు - అంటే శివునికాక ఇతరులను సర్వజ్ఞుడంటే
కుక్కను ఏనుగనటమే - అని భావం)
ఇది విన్న వేమారెడ్డిగారు ఎంతో సంతోషించారు.

ఇందులో పదాలవిరుపులతో ఎంత చమత్కారంగా మారింది.
దీన్ని ప్రహేళికగా చెప్పవచ్చు.
ఎలాగంటే

కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు
పశువు శిశువు తోడ పలుక నేర్చు
వనిత వేదములను వల్లించుచుండును
బ్రాహ్మణుండు కాకి పలలము దిను
- అనే పద్యంలా

ఇందులో మామూలుగా చదివిన వచ్చే అర్థం-
కొందమీద ఉన్న నెమలి కోరిన పాలివ్వడం,
పశువు శిశువుతో పల్కడం, స్త్రీ వేదాలను చదవడం,
బ్రాహ్మణుడు కాకి మాంసం తినడం అనే విపరీతార్థాలు
కనబడతాయి.
అదే పదాలను విరవడం వలన
ఈ అర్థం మారిపోతుంది చూడండి-
1. కొండన్ ఉండు నెమలి
2. కోరిన పాలిచ్చు పశువు
3. శిశివుతోడ వనిత పలుక నేర్చు
4. బ్రాహ్మణుండు వేదము వల్లించుచుండును
5. కాకి పలలము(మాంసము) తినును

ఎలామారిపోయిందో కదా!

No comments: