Tuesday, December 6, 2016

స్తుతి మతియైన ఆంధ్ర కవి ధూర్జటి


స్తుతి మతియైన ఆంధ్ర కవి ధూర్జటి 


సాహితీమిత్రులారా!



సమస్య-
స్తుతి మతియైన ఆంధ్ర కవి ధూర్జటి పల్కులకేల కల్గెనో


సింహాద్రి శ్రీరంగముగారి పూరణ -

స్తుతి మతియైన ఆంధ్ర కవి ధూర్జటి పల్కులకేల కల్గెనో
అతులిత మాధురీ మహిమ అయ్యది కల్గెను రాజ రాజ సం
తత శివభక్తియున్ విమల సార రసంబున నాంధ్ర భారతిన్
సతతము ముంచి యెత్తె కవిసంఘవరేణ్యుడనంత భక్తుడై

శివభక్తితో ఎల్లపుడు సార రసంతో
ఆంధ్ర సరస్వతిని ముంచేత్తడంవల్ల
ధూర్జటికి తులేని మాధుర్యంతో కూడిన పలుకులతో
వచ్చాయని పూరించాడు సింహాద్రి శ్రీరంగముగారు.


మీరును మనోహరమైన పూరణను చేసి పంపగలరు.

No comments: