ఏకాక్షర నిఘంటువు - 5
సాహితీమిత్రులారా !
నిన్నటి తరువాయి..........
ఌ - విద్వేషకర మోహన బీజాక్షరము. ఊసరవెల్లి, పర్వతము,
శరీరము, క్షేమంకరుడు, దేవత, విలాసగమనము,
కన్ను, తల్లి, ఎముక, కద్రువ
ౡ - కేవల మోహనకరమగు ఒక బీజాక్షరము.
------------------------------------------------------------------------------
ఖ - గరుత్మంతుడు, స్వర్గము,కత్తి, శాంతము,
ఈచఁబోయిన కాలుసేతులు కలవాడు.
బంగారు, మణి, కొంచెము, దీనుడు,
సున్న, దవాగ్ని, నిశ్చయము.
ఖం - ఇంద్రుయము, ఆకాశము, స్వర్గము, సుఖము,
నక్షత్రము, వరిమడి, పట్టణము, దయ, పలక,
అభావము, గురుతైన బిందువు, ఉంచుట, రంధ్రము.
ఖః - సామాన్యమైనది, అభావము.
ఖ్యా - ప్రసిద్ధి చెప్పుట.
గ - వినాయకుడు, గంధర్వుడు, గానము, సంతోషవాక్యము.
గః - గంధర్వుడు, గణపతి, గుర్వక్షరము, ఒక స్వరము,
గానము, గమయిత, గాయకుడు.
గా - పూర్వకథ, శ్లోకం, స్తుతి.
గీః - వాక్కు, స్తుతి.
గు - మలవిసర్జనము.
గుః - విజ్ఞానము, చీకటి.
గూః - మలము
గృ - తడుపుట, ఎఁఱుగుట, విన్నపము.
గౄ - ధ్వనించుట, మించుట.
గో - యాగము, వృషభము, చంద్రుడు, వాక్కు, భూమి,
దిక్కు, గోవు, కిరణము, బాణము, నేత్రము, స్వర్గము,
వజ్రాయుధము, జలము, రోమము, సరస్వతి, గుఱి,
సూర్యుడు.
గౌః - కిరణము, గోమేధికము, వజ్రము, వజ్రాయుధము,
చంద్రుడు, సూర్యుడు, గోవు, ఇంద్రియము, కన్ను,
తల్లి, బాణము, తొమ్మిది, జలము, వాక్కు, వెంట్రుక,
భూమి.
గ్మా - భూమి
గ్లై - సంతోషహాని, బడలిక.
గ్లౌః - చంద్రుడు, కర్పూరము.
గ్లౌమ్ - భూబీజము.
No comments:
Post a Comment