Friday, December 9, 2016

యౌవనంబున ముసలి యౌనతండు


యౌవనంబున ముసలి యౌనతండు




సాహితీమిత్రులారా!



ఈ పొడుపు పద్యం చూడండి -
సమాధానాలు చెప్పగలరేమో?

యౌవనంబున ముసలి యౌనతండెవండు?
వరుస కర్ణత్రయము గల్గు వాడెవండు?
వృద్ధుడై యౌవనము గన్న సిద్ధు డెవడు?
వృద్ధిక్షయములు లేని ధీవృద్ధుడెవడు?


చూచారు కదా!
ఆలోచించండి-

1. పడుచుదనంలో కూడ ముసలి అయినవాడు ఎవరు?
    -  బలరాముడు
   - ముసలి - ముసలమును ధరించువాడు - బలరాముడు
     (యౌవనంలో కూడ ముసలాన్ని ఆయుధంగా ధరించినవాడు)

2. కర్ణత్రయము కలవాడు?
   - దుర్యోధనుడు
   (మూడు చెవులున్నవాడు ఎవడు అని ఒక అర్థం
    రెండవది కర్ణ, శకుని, దుశ్శాసనులనే ముగ్గురిని
    తనకు తోడుగా గలవాడు కర్ణత్రయము)

 3. వృద్ధుడై యౌవనాన్ని పొందినవాడు ?
     - చ్యవనుడు (చ్యవన మహర్షి)
    (శర్యాతి కూతురైన సుకన్యను వివాహమాడిన తరువాత
     అశ్వనీ దేవతల వరం వలన యువకుడైనాడు)

4. వృద్ధి క్షయములులేని ధీవృద్ధుడు?
   - మార్కండేయుడు
   (శివుని వర ప్రసాదంతో చిరంజీవిగా అయినవాడు
    అతని బుద్ధి కూడ వృద్ధిక్షయములు లేక స్థిరంగా ఉండేది
    అని తీసుకోవాలి.)

No comments: