ఏకాక్షర నిఘంటువు - 6
సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి..............
ఘ - మేఘము, వేడిమి, చిఱుగంట, ఘంట,
సంఘటనము, శివుడు, గుడ్లగూబ, వాద్యము,
అమృతము, నేల, గొల్లపల్లె, అమ్ము, భయంకరము,
ఒరుయుట.
ఘం - వాద్యము, అమృతము, భూమి, లోక వృత్తాంతము,
భయంకరము, స్తంభనకర సౌభాగ్య బీజాక్షరము.
ఘః - మేఘము, చిఱుగంటలు, సంహారము,
వేడిమి, ఘర్ఘర ధ్వని, లఘువు.
ఘా - దెబ్బ, స్త్రీల కంఠ్యాభరణము
ఘుః - పందిముట్టె
ఘూః - ధ్వని
ఘుమ్ - అవ్యక్తధ్వని బీజము
ఘ్నీమ్ - శంఘ్ని శాలికాశ్యాలా శాద్వలా
శుష్కలా అను బీజపంచకము.
ఙ - భైరవుడు, కాటుక, విషయము,
విషయేచ్ఛ, వేణునాదము
ఙమ్ - కాటుక, భయంకరము, దేశము, జనము,
శివుడు, మాట, విషయవాంఛ
చ - తురుష్కుడు, చోరుడు, ధ్వని, చంద్రుడు, చకోరపక్షి,
చామరము, సముచ్ఛయార్థము, అతిశయము, ఆజ్ఞ, దీప్తి,
శివుడు, సూర్యుడు.
చమ్ - అభిచారమును పోగొట్టు ఒక క్రూరబీజము.
ఛ - కోరిక, కప్పుట, సంవత్సరము, వెలుగు,
స్వచ్ఛమైనది, నిత్యమైనది, మలినమైనది,
వేరైనది, కంచె, బరిణె, నిర్మలము.
ఛః - నాయకమణి, కోయవాడు.
ఛమ్ - భూతములను పారద్రోలెడు,
భీకర రక్తదంష్ట్ర బీజవిశేషము.
ఛాః - భేదయిత, పాదరసము.
జః - విష్ణవు, విప్రుడు, జగణము, జన్మ, ముక్తి, తండ్రి,
పిశాచము, తేజస్సు, విషము, జాతుడు, జేత,
వేగము కలవాడు.
జ - జపము, జయశీలుడౌ పురుషుడు, ధ్వని, మేరువు, మత్సరము,
శివుడు, విష్ణవు, గాయకుడు, నీరు, గంగ, నగ, భార్య,
దేవసేన, యోని, సముద్రపుటొడ్డు.
జం - కటి ప్రదేశము, భూషణము,
భార్య, తేజము, ఉదకము, జననము.
జమ్ - పనులను జెరచునది, తిరస్కరింపరానిదగు ఒక బీజాక్షరం.
జుః - కీర్తి, యుద్ధము, జీర్ణించుట, బృహస్పతి, ఆకాశము, పిశాచము.
జూః - సరస్వతి, ఆకాశము, స్త్రీ భూతము, వేగము.
జ్యా - వింటినారి, తల్లి, భూమి.
ఝ - బ్రహ్మ, అందె, పరాక్రమము, భ్రమణము, నాశము,
చోరుడు, ఝంఝామారుతము, మదము, ధ్వని,
గాలివాన, నశించునది, అలంకారము.
ఝమ్ - భూతనాశకబీజము, నర్తకబీజము, ఇచ్ఛాబీజము.
ఞ - సమూహము, దేశము, గర్వము, గంధలేపనము, శిరస్సు,
గాడిదె కూత, ఊర్ధ్వముఖమైనది, మూఢరూపమైనది,
భయము, కీర్తి, గాయకుడు, జనపదము, పద్యము,
వాయుభేదము, ఝర్ఝరమను ధ్వని.
జ్ఞ - విద్వాంసుడు, బ్రహ్మ, బుధుడు.
No comments:
Post a Comment