చలికిన్ వేడికి భేదమింతయును గాంచరాదు
సాహితీమిత్రులారా!
సమస్య-
చలికిన్ వేడికి భేదమింతయును గాంచరాదు కాంతామణీ
వేదగిరి వేంకట నరసింహరాయశర్మగారి పూరణ-
తలమే బ్రహ్మకునైన నిన్ బొగడ యుద్యద్రాజబింబాననా
తులలేనట్టి మనోజ్ఞమూర్తివిఁగదా దోబూచులిట్లేలనో
కలికీ సర్వరసజ్ఞసమ్మతము నీ కౌగిళ్ళబంధాలలో
చలికిన్ వేడికి భేదమింతయునుఁ గాంచన్రాదు కాంతామణీ
మరోపూరణ వీరిదే ఇది క్రమాలంకారంలో పూరించబడినది
చెలికాడొక్కడు నిద్రలేవడుఁగదా సీమంతినీ నేడిటుల్
నిలయంబేఁగద సూర్యబింబమకటా నిండైన గ్రీష్మంబునన్
జలజాతాక్షునకున్ మహేశ్వరునకున్ చర్చింప, నర్ధాంగివే
చలికిన్, వేడికి, భేదమింతయును గాంచన్రాదు, కాంతామణీ
మీరును మరోవిధంగా పూరించి పంపగలరు
No comments:
Post a Comment