Tuesday, June 7, 2016

యశము నొందగ బూనుడో అమ్మలార!


యశము నొందగ బూనుడో అమ్మలార!


సాహితీమిత్రులారా!

గృహలక్ష్మి (పత్రిక)1931 మార్చిలో
శ్రీమతి ఆచంట సత్యవతమ్మ ఇచ్చిన
ప్రశ్నోత్తరచిత్ర ప్రశ్న
చూడండి.

ఆరక్షరంబుల ఆర్యుల గ్రంథమ్ము
         అతి వ్యాప్తి నొందుచు నలరుచుండు
ద్యక్షర ద్వయంబనువుగా భగవంతుఁ
         గొలుచు వారిని తెల్పు కొమరు మిగిలి
ఒకటైదు ఆరులు ఒనరంగ కలిపిన 
         భీతికి మారు పేరతికి యుండు
నాలుగైదారక్షరాలను గల్పంగ
         గెలుపున కర్థంబు నెలమిగాంచు
మూఁడు నాల్గయిదాఱు మోదంబు దీపించు
         సంపూర్ణ జయమును సరవిదెల్పు
అట్టి పుస్తక నామంబు నరసిమీరు
ఆర్య మత జ్ఞానమభివృద్ధియగు విధాన
పత్రికా బాల "గృహలక్ష్మి" కందఁజేసి
యశము నొందంగ బూనుడో అమ్మలార!

సమాధానము - భక్తవిజయము
1. ఇందులో 6 అక్షరాలు ఉన్నాయి
2. మొదటి రెండు అక్షరాలు - భక్త - భగవంతుని కొలిచేవారిని తెలుపుతుంది.
3. ఒకటి, ఐదు, ఆరు అక్షరాలు కలిపిన భీతికి మారు పేరు - భయము.
4. నాలుగు, ఐదు, ఆరు అక్షరాలను కలుపగా గెలుపని అర్థము - జయము.
5. మూడు, నాలుగు, ఐదు, ఆరు అక్షరాలను కలిపిన సంపూర్ణ జయమును తెలుపుతుంది - విజయము

No comments: