పేరడీ పద్యాలు
సాహితీమిత్రులారా!
ఇది సుమతీ శతకంలోని పద్యం చూడండి.
ఏరకుమీ కసుగాయలు
దూరకుమీ బంధుజనుల దోషముసుమ్మీ
పారకుమీ రణమందున
మీరకుమీ గురువునాజ్ఞ మేదిని సుమతీ!
దీనికి శ్రీశ్రీ రాసిన పేరడీ చూడండి
కోయకుమీ సొరకాయలు
వ్రాయకుమీ నవలలని అవాకుచెవాకుల్
డాయకుమీ అరవ ఫిలిం
చేయకుమీ చేబదుళ్ళు సిరిసిరిమువ్వా!
6 comments:
ఇంత అద్భుతమైన బ్లాగు ఇంతకాలం నా దృష్టికి రాకపోవడం నా దురదృష్టం. పోస్టులన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ బ్లాగును గురించి నా 'శంకరాభరణం' బ్లాగులో మిత్రులకు పరిచయం చేస్తాను.
పెద్దలు కంది శంకరయ్యగారికి నమస్కారం,
మీరు వ్రాసిన అభిప్రాయం నాకు కొండంత బలాన్నిచ్చింది.
మీ అందరి మంచి సలహాలు సహకారం మా "చిత్రకవితా ప్రపంచం" బ్లాగుకు అవసరమని భావిస్తున్నాను.
మీకు ధన్యవాదాలు.
నమస్తే సర్..మీ బ్లాగు మంచి మంచి విషయాలు, పద్యములతో శోభిల్లుతోంది..మా గురువుగారు శ్రీ కంది శంకరయ్యగారు మీ బ్లాగు గురించి చెప్పగా ఇప్పుడే చూసాను..
మీ రెండు బ్లాగులు ‘చిత్రకవితాప్రపంచం, సాహితీనందనం’ నా ‘శంకరాభరణం’ బ్లాగులో పరిచయం చేసాను. క్రింది లింకు చూడండి...
అత్యద్భుతమైన రెండు బ్లాగులు
అధ్భుతంగాబ్లాగ్ నిర్వహిస్తున్న మీకు పరిచయం చేసిన కంది శంకరయ్య గారికి ధన్యవాదములు
- శ్రీరాం
ఆర్యా,
"చిత్రకవిత్వం" అనేది అందరికి మళ్ళీ తెలియాలని మనపూర్వులు చేసిన కృషిని మనం మనతోటి వారికి అందిచాలని మొదలు పెట్టిన ఈ బ్లాగుకు అందరి సహకారం కావాలి.
బ్లాగులోని విషయాలన్నీ చూసి ప్రతిరోజు మీ అందరి వ్యాఖ్యలు, సూచనలు కావాలని బ్లాగును ఇంకా బాగా అభివృద్ధిలోకి తేవాలని నా ఆకాంక్ష.
ఇప్పుడు వ్యాఖ్యలు వ్రాసిన శైలజగారికి, చేపూరి శ్రీరామారావుగారికి ధన్యవాదాలు. శంకరాభరణంలో నా "చిత్రకవితా ప్రపంచం", "సాహితీనందనం" బ్లాగులను పరిచయం చేసిన కంది శంకరయ్యగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
Post a Comment