నలుగురు నిను బలుమారున్ గెలిచిరి
సాహితీమిత్రులారా!
ఈ పద్యం అర్థాన్ని గమనించండి
నలుగురు నిను బలుమారున్
గెలిచిరి సుగుణోక్తి కాంతికీర్త్యాకృతులన్
నలుగురు నిను బలుమారుల్
భళి భళి యన కచ్చిరంగ! భాగ్యతరంగా!
(చాటుపద్యరత్నాకరము -3-188)
సౌభాగ్యతరంగా కచ్చిరంగా
(సుగుణ + ఉక్తి = సుగుణోక్తి, కీర్తి + ఆకృతులన్ = కీర్త్యాకృతులన్)
సుగుణ- మంచిగుణాలలో, ఉక్తి - మంచిమాటలలో,
కాంతి - చక్కదనంలో, కీర్తి - యశస్సులో, ఆకృతులన్ - ఆకారంలో,
నలున్ - నలచక్రవర్తిని, గురున్ - బృహస్పతిని, ఇను - సూర్యుని,
బలు - బలరాముని, మారు(ల)న్ - మన్మథునిగెలిచి(తి)రి- గెవిచినావు,
(అని) నలుగురు- అనేకులు , నిను - నిన్ను, పలుమారుల్ - అనేకసార్లు,
భళి భళి - భళి భళి అను ధ్వనులతో నుతించిరి.
సౌభాగ్యతరంగా! కచ్చిరంగా!
మంచిగుణాలలో నలచక్రవర్తిని, మంచిమాటలలో బృహస్పతిని,
చక్కదనములో సూర్యుని, కీర్తిలో బలరాముని,
ఆకారంలో మన్మథుని, గెలిచావనిఅనేకులు నిన్ను
అనేకమార్లు భళి! భళి! అని ధ్వనులతో పొగిడారు
- అని భావము.
1 comment:
నలుగురు నిను బలుమారుల్..ని.రెండు విధాలుగా ప్రయోగించిన కవి చమత్కారము శ్లాఘనీయము.
Post a Comment