Wednesday, June 1, 2016

మానుష దానమానబల మానితధర్మరమామనోజ్ఞ


మానుష దానమానబల మానితధర్మరమామనోజ్ఞ


సాహితీమిత్రులారా!
అన్వయక్లేశ పద్యాలలో ఇది ఒక పద్యం.
ఈ పద్యం చూడండి.
ఇది మొన్న మనం చూచిన "శ్రీరుచిరత్వభూతి" -
అనే మనుచరిత్ర పద్యానికి ముందు కాలంలోనిది
దీన్ని పెద్దన అనుకరించాడని అర్థమౌతుంది
చూడండి.

మానుష దాన మాన బల మానితధర్మ రమా మనోజ్ఞ రే
ఖానుతి భూతి విత్తముల, కాటయవేమనబోలు, వాసవిన్
వానివిరోధి, వానివిభు, వానివిపక్షుని, వానియగ్రజున్
వాని మరంది, వానిసుతు, వానియమిత్రుని, వానిమిత్రునిన్


కాటయవేమన -
మానవత్వంలో అర్జునుని,
దానంలో అర్జునవిరోధియైన కర్ణునుని,
అభిమానంలో  కర్ణునుని ప్రభువైన దుర్యోధనుని,
బలంలో ఆదుర్యోధనుని శత్రువైన భీముని,
మాన్యధర్మంలో ఆ భీముని అన్నయైన ధర్మరాజును,
సంపదలో ధర్మరాజు బావమరిదియైన కృష్ణుని,
మనోహరరూపంలో కృష్ణకుమారుడైన మన్మథుని,
ఐశ్వర్యంలో మన్మథునుని శత్రువైన ఈశ్వరుని,
ధనవిషయంలో ఆ శివుని స్నేహితుడైన కుబేరునితోను
పోలి ఉన్నాడు సుమా!

No comments: