ద్వ్యక్షరి
సాహితీమిత్రులారా!
ఇక్కడ మనం ఒక రెండు (హల్లుల)వ్యంజనాలతో కూర్చిన శ్లోకాన్ని గమనిద్దాం.
గౌరగూగ్రాగగోగాగగోగోరు గురుగేగురు:
రంగాగారేగారిగంగాగురూరాగిరిరుగ్గిరా
(అలంకారశిరోభూశణే శబ్దాలంకారప్రకరణం - 19)
(ధవళకిరణాలు గల చంద్రునీ,
శివునికొండ అయిన కైలాసాన్నీ,
స్వర్గమందున్న కల్పవృక్షాన్నీ,
కామధేనువును వజ్రాయుధాన్ని పోలిన
తెల్లని కాంతిగల శేషునిశయ్యగా కలిగిన గొప్పవాడు,
గంగాజనకుడు అయిన శ్రీమహావిష్ణువు
వేదవాక్కులచే శ్రీరంగభాగ్య సంపదగా ప్రకటించబడినాడు.)
ఈ శ్లోకంలో గ - కారం, ర - కారంలు మాత్రమే
ఉపయోగించబడి శ్లోకం కూర్చబడినది.
కావున ఇది ద్వ్యక్షరి.
No comments:
Post a Comment