Monday, June 6, 2016

సౌష్ఠ్యవ్యంజనం


సౌష్ఠ్యవ్యంజనం


సాహితీమిత్రులారా!
సౌష్ఠ్యవ్యంజనం అంటే స + ఓష్ఠ్య =  పెదవులతో పలుకబడే
వ్యంజనం (హల్లు) అక్షరాలతో కూర్చబడిన పద్యం.
అచ్చులు లేకుండా  పెదవులతో పలికే హల్లులతోటి కూర్చబడినది సౌష్ఠ్యవ్యంజనం.
ఆ హల్లులు ప, ఫ, బ, భ,మ, వ - అనేవి. వీటిలో
కొన్నిగాని అన్నీగాని తీసుకొని
వ్రాయబడేది సౌష్ఠ్యవ్యంజనం.
దీన్ని ఏకస్థాన చిత్రం అనికూడ అంటారు.


భవభోమ మమా భామా భూమి వామా విభోభువి
భీమభీవైభవావాపీ పావభూమ భవాంబు పా:
                     (అలంకారశిరోభూషణే శబ్దాలంకారప్రకరణం-22)

(శ్రీదేవీ భూదేవి విభుడవైన ఓ రంగనాథా!
భువిలో మాకు భవభయాపహరుడవు కమ్ము.)

 ఈ శ్లోకంలో ప,భ, మ, వ అనే నాలుగు హల్లులే
తీసుకొని వ్రాయడం వల్ల దీన్ని "చతురక్షరి" అనికూడ అంటారు.

No comments: