Friday, June 17, 2016

జనకుని తండ్రి కూతు వర సుతు మామన్


జనకుని తండ్రి కూతు వర సుతు మామన్


సాహితీమిత్రులారా!

ఈ పద్యభావం తెలిగలదేమో చూడండి.

సురవర గురునకు సతిసుత
వర జనకుని తండ్రి కూతు వర సుతు మామన్
శిరమందుఁ గొన్న వరసుతు
నిరతము సేవింతు నియమ నిష్కల్మష మతిన్
                                      (వికట కవిత్వచింతామణి - పుట.14)

ఈ పద్యం భావం తెలియాలంటే కొంచం లోతుగా ఆలోచించాలి.
ఎలాగంటే  పోటీపరీక్షలకు తార్కిక (Verbal Reasoning) ప్రశ్నలలో
ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి.
ముందు వాటిలో ఒకదాన్ని చూద్దాం.

Pointing towards a person  in the photograph, Anjali said, 
"He is the only son of the father of my sister's brother." 
How is that person related to Anjali?

The relations may be analysed as follows:

Sister's brother - Brother;
Brother's father - Father;
Father's son      - Brother
So, the person in the photograph is Anjali's brother.

ఈ చెప్పిన ప్రశ్నవివరణవలెనే మనం ఇక్కడ సమాధానం రాబట్టాలి.
ఇందులో సురవరుగురుడు - బృహస్పతి,
బృహస్పతి భార్య - తార,
తార కుమారుడు - బుధుడు,
బుధుని తండ్రి - చంద్రుడు,
చంద్రుని తండ్రి - సముద్రుడు,
సముద్రుని వరసుత - లక్ష్మిదేవి,
లక్ష్మిదేవి సుతుడు - మన్మథుడు
మన్మథుడు మామ - చంద్రుడు
చంద్రుని శిరమున గొన్నవాడు - శివుడు,
శివుని వరసుతుడు - వినాయకుడు
వినాయకుని నియమముతో, కల్మషములేని మనసుతో 
నిరంతరము సేవిస్తాను. ఇది భావం.

2 comments:

గోలి హనుమచ్చాస్త్రి said...

చెరుకు గడలా ముక్కలు ముక్కలు చేసి అర్థం చేసుకొని రసాస్వాదన చేస్తుంటే..... ఆహా!

(సముద్రుని వరసుత బదులు కూతురు అని వ్రాయాలనుకుంటాను)

ఏ.వి.రమణరాజు said...


ఆర్యా,
మీరు సముద్రుని వరసుత బదులు కూతురు అని ఉండాలనుకున్నారు.
కానీ నాకు దొరకినదానిలో వరసుత ఏనే ఉన్నది.
రెండిటికి అర్థం ఒకటే కదా! మీరు చెప్పిదికూడా బాగానేవుంది.
అదీగాక ఇది గూఢచిత్ర పద్యంకదా!