Sunday, June 26, 2016

ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్.


ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్

సాహితీమిత్రులారా!



"ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్"- అనే
ఈ సమస్యకు పలు పూరణలు చూడండి.


చదవన్నేర్తురు పూరుషుల్ బలెనె శాస్త్రంబుల్ పఠింపించుచో
నదమన్నేర్తురు శత్రుసేనల ధనుర్వ్యాపారముల్ నేర్పుచో
నుదితోత్సాహము తోడ నేలగలరీ యుర్విన్ బ్రతిష్ఠించుచో
ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్.
                                     (చిలకమర్తివారి "ప్రసన్నయాదవం")



ఆచంట సత్యవతమ్మగారి పద్యం

చదువుల్ సాములు శాస్త్రచర్చ, ధరణీ రాజ్ఞీత్వశిల్పంబులున్
కదనంబందున రక్తి, గాన కవితా విజ్ఞాన సారథ్యముల్
సుధలం జిమ్మెడి పాకశాస్త్ర విదితం బాబాల లాలిత్వమున్
ముదితల్ నేర్వగరాని విద్యగలదా ముద్దార నేర్పించినన్
                                                 (గృహలక్ష్మి- 1931 అక్టోబరు)

చిల్కపాటి సీతాంబ పద్యం

అదనంబౌనలు రేట్లు నారులకు ధీయంయండ్రందు నందమ్ము మిం
చెదరన్ కుత్సిత పుందలంపుననొ, సౌశీల్యంబు భగ్నంబగున్
జదురెక్కంగుల కాంతలన్న వెఱనో, శాసించిరిల్ దిద్దనే
ముదితల్ నేరఁగ రాని విద్యగలదే ముద్దార నేర్పించినన్
                                      (గృహలక్ష్మి- 1931 అక్టోబరు)

No comments: