Tuesday, June 21, 2016

బలు వితంతుకు మైథున ప్రాప్తిరస్తు! (పేరడీ పద్యం)


బలు వితంతుకు మైథున ప్రాప్తిరస్తు! (పేరడీ పద్యం)


సాహితీమిత్రులారా!

శ్రీనాథకవిసార్వభౌముడు
ఒకసారి ఒక సుందరాంగిని
చూచి చెప్పిన పద్యం ఇది
చూడండి.

చక్కని నీ ముఖ చంద్రబింబమునుకు 
                      కళ్యాణమస్తు! బంగారు బొమ్మ!
నిద్దంపు నీ చెక్కుటద్దంపు రేకకు 
                     నైశ్వర్యమస్తు! నెయ్యంపు దీవి!
మీటిన పగులు నీ మెరుగు పాలిండ్లకు 
                      సౌభాగ్యమస్తు! భద్రే భయాన!
వలపులు గులుకు నీ వాలు గన్నులకు 
                      న త్యధిక భోగోస్తు! పద్మాయతాక్షి!
మథురిమము లొల్కు నీ ముద్దు మాటలకును
వైభవోన్నతిరస్తు! లావణ్యసీమ!
వన్నె చిన్నెలు గల్గునీ మన్ననలకు
శాశ్వత స్థిరస్తు! యోషాలలామ!


ఈ పద్యానికి వినుకొండ వల్లభరాయని క్రీడాభిరామం (214)లో
వ్యంగ్యానుకరణ  కనిపిస్తుంది.
ఇక్కడ వితంతువులను
మంచన దీవించినట్లు చెప్పబడింది
చూడండి.

చెలఁగి చెలఁగి పొత్తి చీరలు గట్టెడు
         మాచకమ్మకు దీర్ఘమాయురస్తు!
సారె సారెకు దేవసదనంబునకు నేఁగు
         చెడిపెకు సంకల్ప సిద్ధిరస్తు!
నిత్యంబు వ్యభిచార నిష్ఠతో నుండెడు
        విధవకుఁ బుత్రాభివృద్ధిరస్తు!
దళముగాఁ దులసి పేరులు ధరియించినయట్టి
          విశ్వస్త కారోగ్య విభవమస్తు!
మిండ ముండకు సంపత్సమృద్ధిరస్తు!
పఱచు తెంపికి నిత్య సౌభాగ్యమస్తు!
వదరుఁ గల్కికి నీప్సితావాప్తిరస్తు!
బలు వితంతుకు మైథున ప్రాప్తిరస్తు! 

2 comments:

కంది శంకరయ్య said...

కంటి ఆపరేషన్ అయిన కారణంగా కొద్ది రోజులుగా మీ బ్లాగును చూడలేకపోయాను. మరికొన్ని రోజులు చూడలేను. చిత్రకవితానందాన్ని ఆస్వాదించలేకపోతున్నందుకు విచారంగా ఉంది.

ఏ.వి.రమణరాజు said...


పెద్దలు శంకరయ్యగారికి,
మీరు సర్వదా ఆరోగ్యంగా ఉండాలని సాహితీమిత్రు(ని)ల ఆకాంక్ష.