Saturday, June 11, 2016

లచ్చి శంకరుండు లలిమీర గలిసిన



లచ్చి శంకరుండు లలిమీర గలిసిన


సాహితీమిత్రులారా!

ఇదేమిటి లచ్చి శంకరుండు లలిమీర గలిసిన -
ఇదేట్లా సాధ్యం.
ముందు ఈ పద్యం చూడండి.

లక్ష్మి శివుని తోడ లలిమీరగూడిన
భువనకారకుండు పుట్టవలయు
లచ్చి శంకరుండు లలిమీర గలసిన
విష్ణుదేవుడుద్భవింప వలయు

ఇది పైకి అశ్లీలగా, భ్రాంతి కలిగించి, మెదడుకు పదును పెడుతున్నది.
నిదానంగా ఆలోచిస్తే విషయం అర్థమౌతుంది.

లక్ష్మి కి పర్యాయపదాలు చూస్తే - కమల, లచ్చి, రమా, ఇందిర .... ఉన్నాయి.
అలాగే
శంకరునికి పర్యాయపదాలు - భవుడు, ఈశ్వర,ఈశ,....

పై పద్యంలో మొదటి రెండు పాదాలు తీసుకుంటే

లక్ష్మి శివుని తోడ లలిమీరగూడిన
భువనకారకుండు పుట్టవలయు

లక్ష్మి పర్యాయపదం కమల,
శంకర పర్యాయపదం భవుడు,

లక్ష్మి కి శంకరుడు కలిసిన భువనకారకుడు పుట్టాలికదా

పర్యాయపదాలను తీసుకుంటే
కమల(లక్ష్మి) - భవుడు(శంకరుడు) ఈ రెండిటిని కలిపిన కమలభవుడు
అంటే భువనకారకుడు(బ్రహ్మ)కదా!

అలాదే చివరి రెండు పాదములు తీసుకొన్న
లచ్చి శంకరుండు లలిమీర గలసిన
విష్ణుదేవుడుద్భవింప వలయు

లక్ష్మి ని శంకరుడు కలిసిన విష్ణువు పుట్టాలి
పర్యాయపదాలను తీసుకుంటే
రమా(లక్ష్మి) - ఈశ(శంకరుడు) - రమేశ
అంటే  విష్ణువేకదా!
మరి ఇందులో అశ్లీలలేదుకదా!
ఇది గూఢచిత్రము

2 comments:

కంది శంకరయ్య said...

చాలా బాగున్నది.
పద్యాన్ని ఇచ్చి, దానిని ఎక్కడినుండు సేకరించారో తెలిపితే సంతోషం!

ఏ.వి.రమణరాజు said...


ఆర్యా,
అన్నిటికి పద్యం వెంటనే వ్రాసివారి పేరుగాని గ్రంథంపేరుగాని ఇస్తూనే ఉన్నాను. దొరకనివాటికి అలా ఇవ్వలేక పోతున్నాను. క్షమించేది.