Wednesday, June 8, 2016

నరకాసురుని గన్న నాతి నామంబేది?


నరకాసురుని గన్న నాతి నామంబేది?


సాహితీమిత్రులారా!

ఈ పద్యంలోని ప్రశ్నలకు సమాధానాలు
చెప్పగలరేమో చూడండి.

నక్షత్ర వీథికి నాథుడెవ్వండొకో? 
రంగగు గుడిలోని లింగమేది?
వాహనంబుల మీది వన్నెకు మొదలేది?
దేవతా ఋషులకు తిండి యేది?
నరకాసురుని గన్న నాతి నామంబేది?
పొలతి చక్కదనాన బోల్పనేది?
తల్లికి కడగొట్టు తనయునిపైనేది?
కమలాప్తు బింబంబు కప్పునేది?
అన్నిటికి జూడ రెండేసి అక్షరములు 
ఆదు లుడువంగ తుదలెల్ల ఆదు లగును
చెప్పు నాతడు భావజ్ఞ శేఖరుండు 
లక్షణోపేంద్ర! ప్రౌఢరాయక్షితీంద్ర!

ఈ సీసపాదాలలోని ప్రశ్నలకు జవాబులు రెండక్షరాలలో ఉండాలి.
ప్రతి జవాబుకూ చివరి అక్షరం తరువాతి జవాబుకు మొదటి అక్షరం కావాలి.
దీని జవాబులు గమనించండి.

నక్షత్ర వీథికి నాథుడెవ్వండొకో ?
- తారల వరుసకు ప్రభువు - చంద్రుడు - శశి
రంగగు గుడిలోని లింగమేది? - శిల
వాహనంబుల మీది వన్నెకు మొదలేది? - లక్క
దేవతా ఋషులకు తిండి యేది? - దుంప - కంద
నరకాసురుని గన్న నాతి నామంబేది? - భూమి - ధర
పొలతి చక్కదనాన బోల్పనేది? - రంభ
తల్లికి కడగొట్టు తనయునిపైనేది? - భ్రమ
కమలాప్తు బింబంబు కప్పునేది?
- సూర్య బింబాన్ని కప్పేది - మబ్బు

సమాధానాలు ఒకసారి గమనించండి.
శి - శి-క్క - కం- - రం- భ్రమ - మబ్బు

ఇందులో ప్రతి జవాబు రెండక్షరాలదే.
అలాగే ప్రతి జవాబులో చివరి అక్షరం తరువాతదానికి మొదటక్షరంగా వచ్చింది.
ఇవి కవి పెట్టిన షరతులు.
సరిపోయినవికదా!

No comments: