నష్టం తారుణ్య మౌక్తికమ్
సాహితీమిత్రులారా!
వార్ధక్యంవలన వంగి నడుస్తున్న వృద్ధస్త్రీని ఒకడు ప్రశ్నిస్తున్నడు.
ఆమె సమాధాన మిస్తున్నది.
అది శ్లోకంలో.........
అధ పశ్యసి కిం వృద్ధే?
మృగ్యతే వస్తు కంచన!
కిం తద్వస్తు వినమ్రాంగి?
నష్టం తారుణ్య మౌక్తికమ్!
ప్ర.- వృద్ధురాలా! నేల చూచుచున్నావేమి?
స.- పడిపోయిన వస్తువును వెదకుచున్నాను.
ప్ర.- వంగి ఆసక్తిగా వెదకుచున్న ఆ వస్తువేమి?
స.- యౌవన రత్నం పడిపోయింది నాయనా!
No comments:
Post a Comment