కావ్యం శుక ఏవ న మధ్యమ:
సాహితీమిత్రులారా!
ఇద్దరు కవిమిత్రులు ఇలా మాట్లాడు కొనుచున్నారు.
మొదటివాడు - "అలం కరోతి య కావ్యం శుక ఏవ న మధ్యమ:"
రెండవవాడు - "అలం కరోతి య కావ్య శుక ఏవ నమధ్యమ:"
ఇంతకు వీరు మాట్లాడు కొన్నది ఏమంటే-
మొదటివాడు- ఎవడు కావ్యాన్ని లేక శ్లోకాన్ని చక్కగా అలంకారయుక్తంగా
తీర్చి దిద్దుతాడో, వాడు 'న' నకారం మధ్యలో లేనందున
శుకము (చిలుక లేక శుకమహర్షివంటివాడు) అగుచున్నాడు.
రెండవవాడు - అవును! నీవు చెప్పినట్లుకాక, ఎవడు కావ్యాన్ని లేక శ్లోకాన్ని
అలం - అలంకారాలు చాలులే, అన్నట్లుగా అలంకారాలను లేకుండా
రచిస్తాడో, ఆ కవి "నమధ్యమ" ('న' కార: మధ్యే యస్యస: ) 'న' కారం
మధ్యలో కలవాడు అనగా శుక శబ్దానికి మధ్యలో 'న' కారము ఉంచితే -
అది "శు(న)క"- అవుతుంది. నీచజంతువవు అగు కుక్క అవుతాడు.
కానీ శుక తుల్యుడు కాలేడు.
No comments:
Post a Comment