త్వం హాలాహల భృత్కరోషి......
సాహితీమిత్రులారా!
ఆనందవర్ధన కృత వకృోక్తి పంచాశిక అనే కృతిలోనిది ఈ శ్లోకం.
(ఈ కృతిలో మొత్తం 50 శ్లోకాలున్నాయట.)
త్వం హాలాహల భృత్కరోషి మనసో మూర్ఛాం మమాలింగత:
హాలాం నైవ బిభర్మి నైవ చ హలం ముగ్ధేకథం హాలిక:
సత్యం హాలిక తైవ తేసముచితాసక్తస్య గోవాహనే
వక్రోక్త్యేతి జితో హిమాద్రిసుతయా స్మేరో హర: పాతు వ:
పార్వతి - నీవు హాలాహల భరుడవు కౌగిలింపబడి
నా మనస్సునకు మూర్ఛ గావించుచుంటివి.
శివుడు - ఓసి ముగ్ధా నేను హాలను(సురను) హలము(నాగలి)
భరించువాడను కాదు హాలికుడనుకొంటివా?
పార్వతి - సత్యమే ఎద్దునెక్కు నీకు హాలికత్వము తగును.
- అని పార్వతి వక్రోక్తిచే జయింపబడి నవ్వు
శివుడు మిమ్ము రక్షించుగాత!
ఇది సంవాదచిత్రం
2 comments:
రమణ రాజుగారు,
నమస్కారం.
నెట్ లోకొచ్చిన కొద్ది సమయంలో మీ బ్లాగ్ కనపడింది. ఇటువంటి చిత్ర కవితలన్నిటిని ఒక చోట చేరుస్తున్న మీ ఓపికకు జోహారు, చాలా బాగుంది, మొదటి నుంచీ చూడాలని కోరిక.
శర్మగారికి,
నమస్కారం. మీరు చేసిన వ్యాఖ్య చాలా సంతోషకరం. ఇలాగే మాకు ప్రతి విషయం అంటే మంచి చెడులు రెంటిని వ్యాఖ్యల రూపంలో ఆహ్వానిస్తున్నాను. ఇది ఒక యజ్ఞంగా భావించి చేస్తున్నాను. మన పూర్వులు కూర్చిన సంపద ఇది దీన్ని ఒకచోట చేరుస్తున్నాను. కావున అందరికి చేరువ కావడంలో మీలాటి అందరి సహకారం అవసరం. ధన్యవాదాలు.
Post a Comment