Saturday, June 11, 2016

పేరడీ పద్యాలు


పేరడీ పద్యాలు


సాహితీమిత్రులారా!

సుమతీ శతకంలోని ఈ పద్యం చూడండి

అప్పిచువాడు వైద్యుడు
నెప్పుడు నెడతెగక బారు నేఱును, ద్విజుడున్ 
జొప్పడిన యూర నుండుము 
చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతీ!

దీనికి శ్రీశ్రీ పేరడీ పద్యం చూడండి.

ఎప్పుడు పడితే అప్పుడు
కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్
చొప్పడిన యూరనుండుము
చొప్పడకున్నట్టి యూర చొరకుము మువ్వా!


పోతన భాగవతంలోని(8-90)పద్యం -

లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యెఁ; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్ఛె వచ్చెఁ; దనువున్ డస్సెన్, శ్రమం బయ్యెడిన్,
నీవే తప్ప నిత:పరం బెఱుఁగ; మన్నింపం దగున్ దీనునిన్,
రావే యీశ్వర! కావవే వరద; సంరక్షింపు భద్రాత్మకా!

 ఈ పద్యానికి, కామ పరవశుడైన ఒక కవి చెప్పిన పేరడీ పద్యం

పూ విల్కాని సరోజ బాణముల నంభోజారిమై ఛాయలన్
భావంబెంతయు డస్సె మేను బడలెన్ దాపంబు రెట్టించె నే
నీ వాడన్ మధురాధరం బొసగవే! నిక్కంబు నన్నేలవే!
రావే మానిని! కావవే తరుణి!  సంరక్షించు చంద్రాననా!

2 comments:

గోలి హనుమచ్చాస్త్రి said...

ధన్యవాదములు రమణరాజు గారూ! పై పేరడీకి నాకు ఇప్పుడే స్ఫురించి నేను వ్రాసిన మరొక పేరడీ...


కందము:
ఎప్పుడు సెల్ఫోన్ సిగ్నల్
తప్పక, స్పీడ్ తగ్గకుండ తాయింటర్నెట్
చొప్పడిన పేటనుండుము
చొప్పడకున్నట్టి పేట చొరకుము బ్రదరూ!

ఏ.వి.రమణరాజు said...

మీరు వ్రాసిన పద్యం బాగుంది మరియు కాలానికి తగినట్లు ఉన్నది.