Friday, June 3, 2016

పేరడీ పద్యం


పేరడీ పద్యం


సాహితీమిత్రులారా!

భర్తృహరి సుభాషితాలను అనువదిస్తూ ఏనుగు లక్ష్మణకవి విద్యను గురించి
 ఒక చక్కని పద్యం రాశాడు. అది.....

విద్య నిగూఢ గప్తమగు విత్తము, రూపము పూరుషాళికిన్,
విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడున్,
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్,
విద్య నృపాలపూజితము, విద్య నెరుంగనివాడు మర్త్యుడే

దీన్ని దృష్టిలో పెట్టుకొని చివుకుల అప్పయ్యశాస్త్రిగారు
ఈ పద్యాన్ని ప్రేమను వర్ణిస్తూ మనోహరమైన
ఉత్పలమాలలో రాశాడు చూడండి.

ప్రేమ మనోవికారమగు, ప్రేమ గృహస్థ శుభ ప్రదంబగున్,
ప్రేమయె సృష్టి మూలమగు, ప్రేమయె పోషణ ముఖ్య హేతువౌ,
ప్రేమ వినాశకరంబగును, ప్రేమయె ధర్మ నిదాన మయ్యెడిన్,
ప్రేమ సర్వవశ్యమగు, ప్రేమను మించిన లాతి ఉన్నదే

చూడండి ఎంత చక్కగా విద్య బదులు ప్రేమను వర్ణించాడో!

No comments: