వర రాహుధ్వజుల మదిని- వర్ణింతుఁదగన్
సాహితీమిత్రులారా!
ఒక చిన్న పద్యంలో అష్టదిక్పాలకులను, నవగ్రహములను కూర్చుట
క్లిష్టమైన పని దాన్ని
"కేదారోపాఖ్యానం" అనే కావ్యంలో
"క్రిష్టిపాటి వేంకటసుబ్బకవి" చేసి
చూపాడు చూడండి.
హరి పావక యమ నైఋతి
వరుణానిల ధనద భర్గ - వనజహితాబ్జా
ధరసుత బుధ గురు రవి శని
వర రాహుధ్వజ మదిని - వర్ణింతుఁదగన్
ఇందులో
హరి - ఇంద్రుడు, పావకుడు - అగ్ని, యముడు, నైఋతి,
వరుణుడు(జలాధిపతి), అనిలుడు - వాయువు, ధనదుడు - కుబేరుడు,
భర్గుడు - ఈశానుడు - వీరు అష్టదిక్పాలకులు.
ధరసుతుడు - అంగారకుడు(కుజుడు), బుధుడు, గురువు - బృహస్పతి,
రవి - సూర్యుడు, శని, రాహువు, ధ్వజుడు - కేతువు, శుక్రుడు, చంద్రుడు
పరిశేషన్యాయంచే చివరి రెండు పేర్లు తీసుకోబడినవి - ఇవి నవగ్రహాలు.
గ్రహరాజు సూర్యుడు కావున నవగ్రహముల క్రమము
ఈ శ్లోకంలోలాగా ఉండాలి.
ఆదిత్యాయ సోమాయ అంగారక బుధాయచ
గురుశుక్రశనిగ్రహశ్చ రాహవే కేతవే నమ:
ఇది గూఢచిత్రం
No comments:
Post a Comment