కుంభకూటాట్ట కుట్టాక ....
సాహితీమిత్రులారా!
శబ్దాలంకారంలో వృత్త్యనుప్రాసములోని 1. కర్ణాటీ, 2. కౌంతలీ తెలుసుకున్నాము.
ఇపుడు మూడవది కౌంకీ గురించి తెలుసుకుందాం.
'ట' - వర్గాక్షరాలైన ట, ఠ, డ, ఢ, ణ లు అనుప్రయుక్తములైన
అది కౌంకీ వృత్త్యనుప్రాసమని చెప్పబడుచున్నది.
కుంభకూటాట్ట కుట్టాక కుటిలోత్కట పాణిరుట్
హరి: కరటిపేటేన న ద్రష్టుమపి చేష్ట్యతే
(సరస్వతీకంఠాభరణము - 2- 180)
(కుంభస్థలములన్న హర్మ్యాగ్రములను
పడగొట్టుటలో ప్రావీణ్యము గల దారుణమైన
పంజా గల సింహమును ఏనుగులు
చూచుడకు కూడ ప్రయత్నించుటలేదు.)
ఈ శ్లోకంలో ట,ణ - అనే 'ట'-వర్గాక్షరములు అనేకమార్లు ఆవృత్తమైనవి
కావున
ఇది కౌంకీ అను వృత్త్యనుప్రాసకు చెందినది.
No comments:
Post a Comment