దీర్ఘ చతు:స్వర చిత్రం
సాహితీమిత్రులారా!
దీర్ఘ ఏక, ద్వి స్వరచిత్రములను చూచి ఉన్నాము.
ఇపుడు నాలుగు దీర్ఘస్వరములను కలిగిన
దీర్ఘ చతు:స్వర చిత్రం ఇక్కడ గమనిద్దాం.
ఆమ్నాయా నామాహాంత్యా వాగ్గీతీ రీతీ: ప్రీతీ ర్భీతీ:
భోగో రోగో మోహో మోదో ధ్యేయే వేచ్ఛేత్ క్షేమే దేశే
(సరస్వతీకంఠాభరణము - 2-281)
(వేదములకు తుదినున్న వాక్కు(వేదాంతము)
గీతులను ఈతిబాధలని, ఇష్టములను భయములని,
భోగమే రోగమని, మోదమే మోహమని కావున
క్షేమకరమైన క్షేత్రములందు ధ్యానమునందు ధ్యేయుడైన
పరమాత్మయందు మనస్సును నిల్పమని చెప్పెను.)
ఈ శ్లోకంలోని నాలుగు పాదాలలో
1వ పాదంనందు ఆ,
2వ పాదంనందు ఈ,
3వ పాదంనందు ఓ,
4వ పాదంనందు ఏ
- అనే నాలుగు దీర్ఘ స్వరము(అచ్చు)లను
వాడడంజరిగింది.
No comments:
Post a Comment