ఒక నమస్కార మొనరించి ఊరకుంటి
సాహితీమిత్రులారా!
మన కవికోకిల గుర్రం జాషువాగారు పూర్వకవులను
ముక్తపదగ్రస్తములో ఎంత హాస్యంగా
స్తుతించాడో చూడండి.
విజయవిలాసుని వినుతింపఁదలచిన
జక్కన్న కోరమీసాలు దువ్వె
జక్కన్న కవనంబు చక్కనిదని పల్క
పినవీరకవి నాల్క వెళ్ళబెట్టె
పినవీరకవి పల్కువెదికి మగడన్న
గండపెండారమ్ము ఘల్లుమనియె
పెద్దన్న పవితకు పెదతాతయని పల్క
రామభూషణు డంబరంబు చూచె
భట్టుమూర్తికి కవిరాజుపట్టమీయ
తిట్టి లింగడు చేపలబుట్ట చూపె
అందఱందఱు మహనీయులని తలంచి
ఒక నమస్కార మొనరించి ఊరకుంటి
చూడండి ఒక్కొక్క కవి గొప్పదనాన్ని
చెబుతూ మరోవైపు హాస్యాన్ని కూడా
మేళవించారు జాషువాగారు.
No comments:
Post a Comment