హేమన్తే హరిణాక్షీ పయసి........
సాహితీమిత్రులారా!
ఈ ప్రహేళికను చూడండి-
దాసాయ భవననాథే బదరీ మపనేతు మాదిశతి
హేమన్తే హరిణాక్షీ పయసి కుఠారం వినిక్షితి
భవననాథే - ఇంటి యజమాని,
బదరీం - గుబురుగా పెరిగిన రేగుచెట్టును,
అపనేతుమ్ - తొలగించుటకు(కొట్టివేయుటకు),
దాసాయ - సేవకునికి,
ఆదిశతి - ఆనతీయగా,
హరిణాక్షీ - లేడికంటి అయిన ఆమె,
హేమంతే - హేమంతఋతువులో,
కుఠారమ్ - గొడ్డలిని,
పయసి - లోతైన బావినీటిలో,
వినిక్షిపతి - పడవేయుచున్నది.
ఇందులో రేగు చెట్టును కొట్టివేయమని
ఇంటియజమాని ఆజ్ఞాపిస్తే
నాయిక గొడ్డలిని నూతిలో
పారవేయడానికి సంబంధం ఏమిటి -
బాగా విచారిస్తే -
హేమంతంలో చలిబాగా విసురుతుంది.
గొడ్డలి నూతిలో వేస్తే దిగి తెచ్చేదెవరు చలికి.
ఇంటియజమాని చేట్టును కొట్టేయమంటేనే ఆమె
బెదిరి గొడ్డలిని నూతిలో పడేసింది. ఆ రేగుచెట్టు
క్రిందే విటుని పొందువలన కలిగిన నఖక్షతాలను రేగు
కంపవలన కలిగినవని బొంకులాడుచుండెడిది. ఇప్పుడు
ఆ చెట్టు కొట్టేస్తే తన రహస్యం బట్టబయలవుతుంది. అందుకే
తనను తన సంకేత స్థలాన్ని కాపాడుకొనేందుకు ఆపని చేసిందని
ఇందులోని తాత్పర్యం.
No comments:
Post a Comment