రాజన్ కమలపత్రాక్ష!
సాహితీమిత్రులారా!
ఈ ప్రహేళికను చూడండి-
రాజన్! కమలపత్రాక్ష! త త్తే భవతు చాక్షయమ్
ఆసాదయతి యద్రూపం కరేణు: కరణై ర్వినా
నలినదలాక్ష! ఓ నరపతీ!
కరేణువు - (ఆడయేనుగు) కరచరణాది
అవయవములులేని ఏ రూపమును పొందించునో అట్టి అక్షయ
రూపమును పొందుము - అని సామాన్యార్థము.
దీనిలో కరణై: వినా కరేణు: - అనే చోట వ్యాకరణ నియమం ఉంది.
కరణై: వినా కరేణు: అంటే అర్థ కకారము అర్థరేఫము అర్థణకారము అంటే
ఆ పదంలోని హల్లులను తొలగించిన-
క్,అ,ర్,ఏ,ణ్,ఉ: - లనుండి క్,ర్,ణ్ -లను తీసివేసిన,
అ,ఏ,ఉ: -లు మిగులును.
అప్పుడు అ +ఏ = ఐ, ఆయ్(వృద్ధిసంధి ప్రకారం) అవుతుంది.
ఆయ్ + ఉ: = ఆయు:(ఏచోయవాయావ అనే సూత్ర ప్రకారం) అవుతుంది.
ఆయు: అంటే ఆయుస్సు - అనే రూపం ఏర్పడుతుంది.
ఆవిధంగా ఓ రాజా! నీకు ఆయుస్సు సమృద్ధిగా సంభవించుగాక
దీర్ఘయుష్మాన్ భవ! - అని దీవించినట్లవుతుంది.
No comments:
Post a Comment