Tuesday, October 4, 2016

నానా నన స్వస్వ నానా


నానా నన స్వస్వ నానా


సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం గమనించండి

వివి ధధ వవ నానా గగ ర్ధర్ధ నానా
వివి తత గగ నానా మమ జ్జజ్జ నానా
రురు శశ లల నానా వవం ధుధుం నానా
మమ హిహి తత నానా నన స్వస్వ నానా
( వామనుని కావ్యాలంకార సూత్రవృత్తిలోనిది.)


దీనిలో వచ్చిన అక్షరం వెంట
వెంటనే రెండుమార్లు వచ్చాయి.
వ్యవధానంలేకుండా వచ్చిన
అక్షరమే వస్తూ 28 పర్యాయాలు
ఆవృత్తమై శ్లోకమంతా నిండి ఉంది.
దీన్ని సరస్వతీకంఠాభరణంలో
సూక్ష్మవ్యపేత యమకానికి
ఉదాహరణగా ఇచ్చారు.
దీన్ని ఆవలి అనే శబ్దచిత్రంగా
కూడ తీసుకోవచ్చు.

ఇది శ్రీకృష్ణుడు బలరామునికి
సముద్రతీరభూమిని
వర్ణిస్తున్న ప్రసంగమునందలి
ఉదాహరణ పద్యం.

వివిధములైన అర్జున వృక్షములతోడి వనములు కలది.
ఏనుగులను(సర్పములను)కాంక్షించుచు అభివృద్ధములైన
నానా పక్షులతో విస్తృతమైన ఆకాశము కలది. వంగకయే
మునుగుచున్న జనములను గలది(విష్ణువు నామాలము
అంటూ మునుకలు వేస్తున్న జనములను కలది). లేళ్ళ యొక్క
కుందేళ్ళ యొక్క క్రీడలను గలది. మనయొక్క శత్రువులను
సంతాపింపజేయునది, నాకు హితమును కలుగజేయునది,
ముఖము లేకున్నను స్వకీయ నిస్వనములచేతనే ప్రాణములు
నిలుపుచున్నది, స్త్రీరూపమున ఉన్నది
(ఈ సముద్రతీరమునందలి ప్రదేశము) - అని భావం.

No comments: