Wednesday, October 5, 2016

నాళీకంబు నళీకయుక్తి బయలైన........


నాళీకంబు నళీకయుక్తి బయలైన........


సాహితీమిత్రులారా!


ఈ పద్యాన్ని చూడండి-

నాళీకంబు నళీకయుక్తి బయలైనన్ మధ్యమశ్రీకికో
పై లెక్కింపగ నాపయిన్ గుచవచప్రారూఢికాపైజనన్
బాలాగ్రీవకు సాటిగామిగరమున్ బ్రార్ధించి పాదంబున్ 
వ్రాలన్ వ్రీలెనళీకయుక్తి సతికన్ సన్నన్మెలంగెం దుదిన్
                                                (నానార్థగాంభీర్యచమత్కారిక పుట-38)


నాళీకము, అసత్యమైన యుక్తిచేత
అనగా - ళీ- అనే వర్ణాన్ని లేకపోతె అనగా
నళీకము - లో ళీ - తొలగించిన- నాకము అనగా
ఆకాశం గా మధ్యమశ్రీకి సరిఅయినది.
అంటే శ్రీ అనే అక్షరంలో మధ్యము(నడుము) లేదుకదా.
అలాగే నాళీకములో నా- తీసి కో, పై లు పెట్టిన
కోకము, పైకము అవుతాయి.
కోకము అంటే చక్రవాకము ఇది కుచ ప్రారూఢికి, కుచ ప్రశస్తికి,
పైకము- కోకిల సమూహము వాక్ ప్రశస్తికి,
కాపైజనన్ - నాళీకములో క- తీసివేసిన నాళీ,
నాళము బాలయొక్క కంఠమునకు సాటిఅయినదిగాను.
నాళీకము అనగా పద్మముకావున హస్తములను ప్రార్థించిన
పాదములకు ఓడెను. ళీ, క - లు తీసివేసిన
నా - అయి అనగా పురుషుడు సతియొక్క
కనుసన్నలలో సంచరిచును అని తాత్పర్యము.

దీనిలో అక్షరాలను తీసివేస్తూ పోవడం జరుగుతూంది 
కావున ఇది అక్షరచ్యుతక చిత్రము.

No comments: