Monday, October 10, 2016

క్రమ్మర నావిభు నామమయ్యెడున్


క్రమ్మర నావిభు నామమయ్యెడున్


సాహితీమిత్రులారా!


ఒక యువతి తన మిత్రురాలిని ప్రేమతో,
"నీ భర్త పేరేమ"ని అడిగందట
దానికి ఆమె సూటిగా చెప్పకుండా
పొడుపుకథలా చెప్పి అందులో ఉంది
నాపతి పేరు అని చెప్పింది.
ఆ పద్యం చూడండి-

మమతమ దన్ను నొక్క చెలి మానిని నీవిభు నామ మేమనన్
కమలజ గంధి పల్కె, కరికంధిప్రజాపతిచంద్రికాతప
త్రముల ద్రివర్ణయుక్తముగ వ్రాసియు నందలి మధ్యవర్ణముల్
క్రమముగ కూర్చి పల్కినను క్రమ్మర నావిభు నామమయ్యెడున్

ఇందులో కరి, కంధి, ప్రజాపతి, చంద్రిక, ఆతపత్రము - అనే
వాటిని మూడు అక్షరాల పదాలుగా అర్థం తీసుకొని వాటిలోని
మధ్య అక్షరాలను తీసుకుంటే ఆమె భర్తపేరు వస్తుందట.
చూద్దాం-
కరి -               ఏనుగు    -సారంగం
కంధి -            సముద్రం - సారం
ప్రజాపతి -       బ్రహ్మ      - విధా
చంద్రిక -         వెన్నెల   - కౌముది
ఆతపత్రం -      గొడుగు   - గొడుగు

వీటిలోని మధ్య అక్షరాలను తీసుకుంటే
రంగధాముడు అవుతుంది.
అంటే ఆవిడ భర్తపేరు అదన్నమాట.

No comments: