మామ సకలశుభములనొసగున్!
సాహితీమిత్రులారా!
ఆశీర్వాద పద్యాలు గూఢచిత్రంలో
కొన్ని చూచాము మరొకటి ఇక్కడ.
నీరజమిత్రునిసుతుసుతు
కూరిమిసతి ధవునితండ్రి కొమరునియన్నన్
ధీరతననిబరిమార్చిన
సూరునిసుతుమామ సకలశుభములనొసగున్
(నానార్థగాంభీర్యచమత్కారిక)
నీరజమిత్రుడు - సూర్యుడు
సూర్యునిసుతుడు - యమధర్మరాజు
అతని సుతుడు - ధర్మరాజు,
ధర్మరాజు కూరిమి సతి - ద్రౌపది
ద్రౌపది ధవుడు - అర్జునుడు,
అర్జునుని తండ్రి - ధృతరాష్ట్రుడు(పెదనాన్న)
ధృతరాష్ట్రుని కొమరునియన్నన్ - దుశ్శాసనుని అన్న దుర్యోధనుడు
దుర్యోధనుని ధీరతననిబరిమార్చిన సూరుడు - భీముడు
భీమునికుమారుడు - అభిమన్యుడు
అభిమన్యుని మామ - శ్రీకృష్ణుడు
శ్రీకృష్ణుడు సకల శుభములను ఇచ్చుగాక!
ఇందులో కొంత చక్కని దారిలోగాక
ప్రక్కమార్గాల గుండా
శ్రీకృష్ణుని రాబట్టాల్సివచ్చింది
కవి ఎందుకో అంత ప్రయాసపెట్టాడు.
చిత్రకవిత్వ లక్షణం కూడా అదేననుకోండీ
No comments:
Post a Comment