నడి మక్కరముల్ గణుతింప పేరగున్!
సాహితీమిత్రులారా!
ఒక స్త్రీని తన భర్తపేరు అడగగా ఆమె తన భర్తపేరును
ఎంత తెలివిగా ఈ పద్యంలో గూఢ పరచి చెప్పిందో
చూడండి.
సరసిజనేత్ర! నీ విభుని చక్కని పేరు వచింపుమన్న ఆ
పరమ పతివ్రతామణి భావమునం ఘనమైన సిగ్గునన్
కరియును-రక్కసుండు-హరికార్ముకమున్-శర-మద్దమున్-శుకం
బరయగ వీనిలోని నడి మక్కరముల్ గణుతింప పేరగున్!
అని చెప్పిన
అందులోనుండి ఆమె భర్తపేరును బహిర్గతం చేయాలిమరి.
కరియును-రక్కసుండు-హరికార్ముకమున్-శర-మద్దమున్-శుకం -
ఇందులోని నడిమి అక్షరాలు అంటే
ప్రతి దానికి 3 లేక 5 అక్షరాల పదమై ఉండాలికదా!
కరి - ద్విరద
రక్కసుడు - అఘుడు
హరికార్ముకము - పినాకం
శర - సాయకం
అద్దము - ముకురం
శుకం - చిలుక
వీటిలోని నడిమి(మధ్య)అక్షరాలను తీసుకుంటే
రఘునాయకులు అవుతుంది.
అది ఆమె భర్తపేరు.
No comments:
Post a Comment