నదీషు మలయానిల:
సాహితీమిత్రులారా!
శబ్దాలంకారాలలో వృత్త్యనుప్రాసములో
12 విధములని తెలుసుకొని ఉన్నాము
అందులో 7 శుద్ధనుప్రాసలని, 5 సంకరాను
ప్రాసలని మొత్తం 12 అనుప్రాసలు.
వాటిలో సంకరానుప్రాసలోని
మాత్సీ, మాగధీ, తామ్రలిప్తికా
తెలుసుకొనినాము.
ఇప్పుడు 4వదైన ఔండ్రీ వృత్త్యనుప్రాసము
తెలుసుకొందాము.
సమాన సంయుక్తములతో కూర్చబడిన
దానిని ఔండ్రీ అంటారు.
దీనికి ఉదాహరణ.........
సల్లతా పల్లవోల్లాసీ చిత్తవిత్తహరో నృణామ్
మజ్జతీజ్జల సజ్జాసు నదీషు మలయానిల:
(సరస్వతీకంఠాభరణము - 2 - 188) (చక్కని లతల పల్లవాలలో ఉల్లాసం పొందేవాడు,
మానవుల చిత్తవిత్తములను హరించేవాడు అయిన
మలయసమీరణుడు నీచుల సన్నద్ధములైన
నదులలో మునుగుతున్నాడు.)
ఔండ్రీ వృత్త్యనుప్రాసములో సరూపములైన వర్ణములతో
సంయోగము నొందును అని మొదట చెప్పుకొనినాము.
అంటే ద్విత్వాక్షరాలు అనుప్రాసగా రావటం.
ఉదాహరణ శ్లోకంలో ల -కారము, త - కారము, జ - కారముల
ద్విత్వాలు ఆవృత్తమైనాయి.
కావున దీన్ని ఔండ్రీ వృత్త్యనుప్రాసాలంకారమునకు
ఉదాహరణం అనవచ్చు.
No comments:
Post a Comment