Monday, August 1, 2016

హలీ హలీ హలీ మాలీ


హలీ హలీ హలీ మాలీ


సాహితీమిత్రులారా!

ఒకే వ్యంజనము భిన్నస్వరసంయోగముతో
అనేక పదాలలో వచ్చిన
అది మాలాయమకము అని పిలుస్తాము.
నాట్యశాస్త్రములోని
ఈ ఉదాహరణ శ్లోకం చూడండి.

హలీ బలీ హలీ మాలీ ఖేలీ మాలీ సలీ జలీ
ఖలో బలో బలో మాలో ముసలీ త్వభిరక్షతు

హలము ధరించినవాడును, బలవంతుడును,
శూలధారియును, మాలధారియును,
విలాసవంతుడును, సలియును, జలియును,
బలవంతుడును, ముసలధారియు అయిన
బలరాముడు రక్షించుగాక!

No comments: