ఏమిటిది చెప్పండి?
సాహితీమిత్రులారా!
మనం మామూలుగా
భోజనపంక్తి దగ్గర ఎక్కువగా
ఈ సామెతను మాడుతుంటాము.
తిండికి ముందు పనికి వెనుక ఉండాలి - అని.
ఈ సందర్భంలో ఎక్కువగా వాడటం వల్ల ఇదిసామెతే అనుకుంటున్నాము.
కాని ఇది ఒక పొడుపు కథ.
చూడండి.
తిండికి ముందు ఉండేది
పనికి వెనుక ఉండేది
ఏది చెప్పండి?
- అంటే ఆలోచించాల్సిందేగా!
ఆలోచిస్తే
తిండికి ముందుండేది - కుడిచెయ్యి
అలాగే
పనికి వెనుక ఉండేది -
అంటే అదీ - కుడిచెయ్యే
ఎట్లాగంటే ఏ పనైనా చేయటానికి చెయ్యి ఎత్తి చేయాలికదా
అప్పుడు చెయ్యి వెనక్కేకదా వెళ్ళేది.
అందుకే
తిండికి ముందుండేది
పనికి వెనకుండేది ఏది?
సమాధానం - కుడిచెయ్యి
దీన్నే కొందరు
తినటానికి ముందు -
యుద్ధానికి వెనుక - అని కూడ అంటుంటారు.
No comments:
Post a Comment